రిజర్వాయర్లు

    • గుండ్లకమ్మ ప్రాజెక్టు

గుండ్ల కమ్మ ప్రాజెక్టును 12.845 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మల్లవరం వద్ద 80 అడుగుల ఎత్తున గుండ్లకమ్మ నదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్‌లో 62,368 ఎకరాలకు, రబీలో 80,060 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ. 592 కోట్లతో ప్రాజెక్టును నిర్మించారు. 2008 నవంబరులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు నుంచి కాలువలకు నీరు విడుదల చేశారు. సాగునీరు కాక ఈ ప్రాజెక్టు ఒంగోలు , ఒంగోలు పరిసర ప్రాంతాలలోని 2,50,000 త్రాగునీరు అందిస్తుంది.

    • రాళ్లపాడు ప్రాజెక్టు

జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులో రాళ్లపాడు జలాశయం ఒకటి. దీనిని కందుకూరు నియోజకవర్గం, లింగ సముద్రం మండలం, రాళ్ళపాడు వద్ద  నిర్మించారు. 2202 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 31.30 మిలియన్ క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్ధ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు కింద 16,500 ఎకరాలు అధికారికంగా, ఎనిమిదివేల ఎకరాలు అనధికారికంగా సాగవుతోంది. కుడికాలువ 20కిలోమీటర్లు పొడవున 14500 ఎకరాలకు , ఎడమకాలువ 3 కిలోమీటర్ల పొడవున 1500 ఎకరాలకు నీరందిస్తుంది.12.19×4.57m పరిణామంలోని 10 గేట్లతో పాత స్పిల్ వే ఉండగా , 12.19×7.62m పరిణామంలోని 5 గేట్లతో కొత్త స్పిల్ వే నిర్మించారు. తాగు, సాగునీటికి నెల్లూరు జిల్లాలోని కొండాపూరు, ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు , లింగ సముద్రం మండలాలకు కల్పతరువుగా పనిచేస్తోంది. వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది.

    • మోపాడు

మధ్యతరహా ప్రాజెక్టు మోపాడు రిజర్వాయరును  మన్నేరు పై 1906 -21 మధ్య నిర్మించారు 6.47.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 61 మిలియన్ క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యంతో నిర్మించారు ఇదిప్రకాశం జిల్లాలోని పామూరు మండలం,  నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు, కొండాపురం మండలాలలోని   12,719 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది.