ముగించు

జిల్లా గురించి

జిల్లా గురించి

ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, దివంగత శ్రీ టంగుటూరి “ప్రకాశం పంతులు”( ఆంధ్ర కేసరి) గారి జ్ఞాపకార్థం దీనిని 1972 లో ప్రకాశం జిల్లాగా మార్చారు. ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ జిల్లాలోని నాగులుప్పల పాడు మండలానికి చెందిన కనుపర్తి పంచాయతికి చెందిన కుగ్రామమైన వినోదరాయుని పాలెంలో జన్మించారు.జిల్లా ఉష్ణమండల ప్రాంతంలో 14-57′-00 16 నుండి 16-17′-00 ′ ఉత్తర అక్షాంశం మరియు 78-43-00 80 నుండి 80-25’-00 ″ తూర్పు రేఖాంశం మధ్య ఉంది.జిల్లా యొక్క మధ్య భాగంలో తక్కువ పొదలు మరియు రాతి కొండలు మరియు రాతి మైదానాలతో వైవిధ్యభరితమైన అడవులు ఉన్నాయి ఇది జిల్లా యొక్క విచిత్ర లక్షణం.

సహజవనరులు

  • కొండలు
  • సుందరమైన నల్లమల, వెలిగొండ కొండలు జిల్లాలోని ముఖ్యమైన కొండలు. ఇవి కర్నూలు, కడప జిల్లాలనుండి మన ప్రకాశం జిల్లాను వేరు చేస్తున్నాయి
    నల్లమల కొండలు 113 కిలోమీటర్ల పొడవున, 32 కిలోమీటర్ల వెడల్పున ఉత్తర -దక్షిణ దిశలో ఎగుడుదిగుడు తలంతో ఒక మాదిరి వాలుతో సముద్ర మట్టం నుండి 620 కిలోమీటర్ల ఎత్తుతో అవిచ్చిన్నంగా విస్తరించి ఉన్నాయి. నల్లమల కొండలు తూర్పున గిద్దలూరు అటవీ డివిజన్, పశ్చిమాన కర్నూలు అటవీ డివిజన్ మధ్య, గిద్దలూరు, మార్కాపురం, అర్ధవీడు, కంభం, యర్రగొండపాలెం మండలాల్లో విస్తరించి ఉన్నాయి. నల్లమల కొండల్లో రెండు కనుమలు ఉన్నాయి. అవి నందికనుమ నంబాల కనుమ. నందికనుమ పశ్చిమాన కర్నూలు, బళ్లారిల మధ్య రాకపోకలకు వీలు కల్పిస్తుంది. నంబాల కనుమ తూర్పున దోర్నాల ఎర్రగొండపాలెం మార్కాపురం, పశ్చిమాన ఆత్మకూరు ప్రజల మధ్య రాకపోకలకు వీలుగా ఉన్నాయి . గుంటూరు జిల్లాలోని నరసరావుపేట వైపునుండి అద్దంకి వైపు వెళుతూ ఉంటే కొండవీటి కొండలమీద కొండవీటి దుర్గాన్ని చూడవచ్చు. వెలిగొండ కొండలు మధ్యలో విశాలమైన లోయ కలిగిన రెండు సమాంతర శ్రేణులుగా ఒక మాదిరి వాలుతో ఉత్తర దక్షిణ దిక్కుల్లో వ్యాపించి ఉన్నాయి . తూర్పుకనుమలు నుండి ఏర్పడే నీటి ప్రవాహాలు గిద్దలూరు కనిగిరి మండలాల మధ్య సరిహద్దులుగా ఉన్నాయి. ఇవి ఉత్తరం వైపుగా ప్రవహించి గుండ్లకమ్మ నదిలో కలుస్తాయి

  • సముద్రతీరం
  • జిల్లాలోని చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, నాగులుప్పలపాడు, ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లో సుమారు 102 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. కొన్ని మండలాల్లో బీచ్ లు ఉన్నాయి. వాటిలో చీరాల మండలంలోని ఓడరేవు. చిన్నగంజాం మండలంలోని మోటుపల్లి , కొత్తపట్నం, ఉలవపాడు మండలం లోనిరామాయపట్నం ముఖ్యమైనవి.

  • నదులు
    1. గుండ్లకమ్మ, మన్నేరు, ముసి, పాలేరు, జిల్లాకు నీటిని అందిస్తున్నాయి . ఇవికాక తమ్మిలేరు, సగిలేరు, గుడిసెలేరు లాంటి చిన్న నదులు, ఒగేరువాగు, నల్లవాగు, వడిమంగళలు జిల్లాలోని ఇతర జల వనరులు.

    2. గుండ్లకమ్మ నది నల్లమల అడవుల్లో 2700 అడుగుల ఎత్తులో గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద ప్రారంభమై, కంభం లోయ గుండా ప్రవహించి మైదానంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఈశాన్యంగా ప్రవహించి ముండ్లమూరు, అద్దంకి, మద్దిపాడు, ఒంగోలు. మండలాల మీదుగాప్రవహించి ఒంగోలు మండలం లోని దేవరంపాడు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కండలేరు, చిలమలేరు దీనిలో వచ్చి కలుస్తాయి. గుండ్లకమ్మ మొత్తం పొడవు 265 కిలోమీటర్లు కాగా అందులో 220 కిలోమీటర్ల దూరం మన జిల్లాలోనే ఉంది. గుండ్లకమ్మ నది మీద మద్దిపాడు మండలం మల్లవరం వద్ద నిర్మించిన గుండ్లకమ్మ రిజర్వాయరు జిల్లాలోని అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు. ఇదికాక ఈ నదిపై తిప్పాయపాలెం రిజర్వాయరు, పాలేరు ప్రాజెక్టు, కంభం, భవనాశి చెరువులు ఆధారపడి ఉన్నాయి.

    3. మన్నేరు నది సి.ఎస్.పురం మండలం, బాలుపల్లె దగ్గర వెలుగొండ కొండల్లో పుట్టి, నెల్లూరు జిల్లాలో గుండా ప్రవహించి లింగసముద్రం మండలం, పెంట్యాల దగ్గర మలుపు తీసుకొని, జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఆ విధంగా 112 కిలోమీటర్లు ప్రవహించి ఉలవపాడు మండలం, కరేడు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. బొక్కలవాగు, నేరెళ్ల వాగు ఈ నదిలో కలుస్తాయి. ఈ నది మోపాడు రాళ్లపాడు రిజర్వాయర్ కు కోట చానల్ కు నీటిని అందిస్తుంది.

    4. మూసినది వెలుగొండ కొండల్లో, డోక్కలసాల దగ్గర ప్రారంభమై, తూర్పుకు ప్రయాణించి, తరువాత దక్షిణం వైపు తిరిగి మార్కాపురం, దర్శి, పొదిలి, కొండేపి, టంగుటూరు మండలాల మీదుగా ప్రవహించి , కొత్తపట్నం మండలం లోని మడనూరు దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది గజ్జలేరు, దండలేరు, అట్లేరులను కలుపుకొని ప్రవహిస్తుంది. పొదిలి కొనకనమిట్ల మండలాల్లోని చెరువులకు నీటిని అందిస్తుంది.

    5. పాలేరునది వినుకొండ కొండల్లో పుట్టి వెలిగండ్ల, కనిగిరి, కందుకూరు, జరుగుమల్లి, సింగరాయకొండ, టంగుటూరు మండలాల్లో సుమారు 112 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, సింగరాయకొండ మండలం, పాకల దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఇది పాలేరు, బిట్రగుంట నీటి పథకాలకు నీరు అందిస్తుంది.

  • అటవీ సంపద
  • జిల్లాలోని మొత్తం అటవీ విస్తీర్ణం 4,61,983 హెక్టార్లు. ఇది మొత్తం విస్తీర్ణంలో 26.2 శాతం గా ఉంది. గిద్దలూరు కొమరోలు, రాచర్ల, అర్ధవీడు, ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు, దోర్నాల మండలాల్లో ప్రసిద్ధిచెందిన నల్లమల అడవులు ఉన్నాయి. తీరప్రాంతాల్లో సరుగుడు, జీడిమామిడి లాంటి తోటలు ఉన్నాయి. నల్లమల అడవి వన్యప్రాణుల కి, పులులకి ఆవాసంగా ఉంది

  • నేల రకాలు
  • ఎర్ర, నల్లరేగడి నేలలు జిల్లాలోని ప్రధానమైన నేల రకాలు. ఇవి వరుసగా 51 %, 41%, 6% నిష్పత్తిలో విస్తరించి ఉన్నాయి. ఒంగోలు డివిజన్ లోని 16 మండలాల్లో నల్లరేగడి నేలలు ప్రధానంగా ఉన్నాయి. ఎర్రనేలలు ముఖ్యంగా కందుకూరు మార్కాపురం డివిజన్ లోని దాదాపు 19 మండలాల్లో విస్తరించి ఉన్నాయి. చీరాల, వేటపాలెం, Deleted: ఎర్ర, నల్లరేగడి నేలలు జిల్లాలోని ప్రధానమైన నేల రకాలు. ఇవి వరుసగా 51 %, 41%, 6% నిష్పత్తిలో విస్తరించి ఉన్నాయి. ఒంగోలు డివిజన్ లోని 16 మండలాల్లో నల్లరేగడి నేలలు ప్రధానంగా ఉన్నాయి. ఎర్రనేలలు ముఖ్యంగా కందుకూరు మార్కాపురం డివిజన్ లోని దాదాపు 19 మండలాల్లో విస్తరించి ఉన్నాయి. చీరాల, వేటపాలెం, చినగంజాం, ఉలవపాడు మండలంలో మామిడి, జీడిమామిడి, సరుగుడు తోటలకు అనుకూలమైన ఇసుక నేలలు ఉన్నాయి.

  • శీతోష్ణస్థితి, వర్షపాతం
  • జిల్లాలోని తీర ప్రాంతంలో సముద్రం నుంచి వీచే గాలులు వేసవి, శీతాకాలాల్లో ఉష్ణోగ్రతలను నియంత్రిస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో, ముఖ్యంగా ఎత్తయిన కొండ ప్రాంతాల్లో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ నమోదయిన సగటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు 33.7 సెంటిగ్రేడ్ 24.1 సెంటిగ్రేడ్ లు. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో నమోదవుతాయి.జిల్లాలో వర్షపాతం ప్రధానంగా నైరుతి మరియు ఈశాన్య రుతుపవనాల వల్ల లభిస్తుంది. నైరుతి ఋతుపవనాల వల్ల సగటున 388.3 మిల్లీమీటర్లు. ఈశాన్య రుతుపవనాల వల్ల 393.7 మిల్లీమీటర్ల వర్షపాతం లభిస్తుంది . రుతుపవనాలు సక్రమంగా రాకపోవడం వల్ల, ప్రధానంగా చెరువులు, బావుల మీద తాగునీటి కోసం ఆధారపడటం వల్ల జిల్లాలో వ్యవసాయం జూదంగా మారింది.

  • సాగునీటి సామర్ధ్యం
  • జిల్లాలో మేజరు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా 5.02 లక్షల ఎకరాలుఆయకట్టు, మధ్యతరహా, చిన్నతరహా, సాగునీటి పథకాల ద్వారా 6.09 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతున్నది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు, కృష్ణా పశ్చిమ డెల్టా లు మేజర్ సాగునీటి పథకాలు.రాళ్లపాడు రిజర్వాయర్, మోపాడు రిజర్వాయరు, పాలేరు బిట్రగుంట ఆనకట్ట, వి. ఆర్. కోట ఆనకట్ట , కంభం చెరువులు మధ్యతరహా సాగునీటి వనరులు.ఇదికాక 957 చిన్నతరహా సాగునీటి చెరువులు సుమారు 1.38 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నాయి. 957 చిన్నతరహా సాగునీటి చెరువుల్లో 589 చెరువులను, పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తున్నది .

  • విస్తీర్ణం, జనాభా
  • జిల్లా మొత్తం విస్తీర్ణం 17,626 చదరపు కిలోమీటర్లు కాగా జనసాంద్రత చదరపు కోలోమీటరుకు 193 మంది. ఇతర కోస్తా జిల్లాలతో పోలిస్తే ప్రకాశం జిల్లా విస్తీర్ణంలో పెద్దది. పది మండలాల్లో సుమారుగా 102 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నది.2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో ఒక 1093 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 1058 రెవెన్యూ గ్రామాలు కాగా మిగిలిన 35 అటవీ గ్రామాలు. మొత్తం ఒక 1093 గ్రామాల్లో 1002 జనావాసం ఉన్నవి. మిగిలిన 92 గ్రామాలు నిర్వాసితాలు.జిల్లాలోని అన్ని మండలాల భౌతిక స్థితిగతులు సహజవనరులు సామర్ధ్యాలు ఒకే విధంగా లేవు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా మొత్తం జనాభా 33,97,448.ఇది మొత్తం రాష్ట్ర జనాభాలో 6.88 శాతంగా ఉంది రాష్ట్రంలో జిల్లా జనాభా ననుసరించి 9వ స్థానంలో ఉంది. జిల్లాలోని మహిళల జనాభా 16,82,684 . ఇది జిల్లాలో 49.5 3% రాష్ట్రంలో 6.83 శాతంగా ఉంది. తాజా జనాభా లెక్కలననుసరించి, జిల్లాలోని గ్రామీణ జనాభా 27,33,866 కాగా ఇది మొత్తం జిల్లా జనాభాలో 80. 44 శాతంగానూ, మొత్తం రాష్ట్ర జనాభాలో 7.86% ఉంది. అదేవిధంగా జిల్లాలోని పట్టణ జనాభా మొత్తం 12 పట్టణాల్లో 6, 64,582 . ఇది జిల్లా జనాభాలో 9.56 శాతం రాష్ట్ర జనాభాలో 4.5 శాతం ఉంది.సామాజిక వర్గాల వారీగా జిల్లాలోని షెడ్యూలు కులాల జనాభా 7,87,861. ఇది జిల్లా జనాభాలో 23.1 9 శాతంగా ఉంది. అలాగే మొత్తం రాష్ట్రంలోని షెడ్యూలు కులాల జనాభాలో 9.33 శాతంగా ఉంది. అదేవిధంగా షెడ్యూలు తెగల జనాభా 1,51,145. ఇది జిల్లాలో4.45%. నను రాష్ట్రంలో మొత్తం షెడ్యూలు కులాల జనాభాలో 5.04 శాతంగా ఉంది.2001 నుండి 2011కి జనాభా పెరుగుదల జిల్లాలో 11.50 5 శాతంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జనసాంద్రత చదరపు కిలోమీటర్ కి 193 గా ఉంది. అది రాష్ట్రంలో చదరపు కిలోమీటర్ కి 308గా ఉంది. జిల్లా అక్షరాస్యత 63.08% ఇది రాష్ట్ర అక్షరాస్యత శాతమైన 6 7.41% కంటే తక్కువ. స్త్రీ , పురుష నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలు. ఇది రాష్ట్రంలో 1000కి 996 గా ఉంది.2011 జనాభా ప్రకారం ప్రధానంగా శ్రామికుల సంఖ్య 14,63,508. ఇది జిల్లా జనాభాలో 43.9 గా రాష్ట్ర జనాభాలో 7.6%గా ఉంది.

  • జిల్లాలోని పాలనా విభాగాలు
  • జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. అవి ఒంగోలు, కందుకూరు, మార్కాపురం. అంతకు పూర్వం ఉన్న 14 తాలూకాలను, 17 పంచాయతీ సమితులు రద్దుచేసి, పరిపాలనని ప్రజల వద్దకు తీసుకు వచ్చే ఉద్దేశంతో 25 5 1985 న 56 మండలాలను ఏర్పాటు చేసి, 15.01.1987 నుండి అమలులోకి తేవడం జరిగింది. వీటితోపాటుగా నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి. అవి ఒంగోలు, కందుకూరు, చీరాల, మార్కాపురం. జిల్లాలో మొత్తం మూడు రెవిన్యూ డివిజన్లు ఉన్నాయి. అవి ఒంగోలు, కందుకూరు,మార్కాపురం. ఒంగోలు డివిజన్లో 20 మండలాలు, కందుకూరు డివిజన్లో 24 మండలాలు, మార్కాపురం డివిజన్లో 12మండలాలు ఉన్నాయి. మొత్తం 1002 ఆవాసిత రెవిన్యూ మండలాల్లో మొత్తం 1043 గ్రామ పంచాయితీలున్నాయి. వీటిలో 62 నోటిపైడ్ , 981 నాన్ నోటిఫైడ్ పంచాయితీలు.